ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధూమ్ ధామ్' నుండి టమాటో బుగ్గల పిల్ల సాంగ్ లిరికల్ షీట్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 05:03 PM

యువ నటుడు చేతన్ కృష్ణ ధూమ్ ధామ్ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగల్ ని టమాటో బుగ్గల పిల్ల అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యొక్క లిరికల్ షీట్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ ఆకట్టుకునే కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com