ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్ టైమ్ ని లాక్ చేసిన 'రాయన్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:29 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 1 గంట 18 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉండగా సెకండ్ హాఫ్ 1 గంట 7 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com