ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టాక్సిక్' తాజా షూట్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 08:14 PM

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్ ని మూవీ మేకర్ లాక్ చేసారు. “ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్” అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం బెంగుళూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో తారా సుతారియా రెండవ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుందని పుకార్లు వస్తున్నాయి. నయనతార యష్ సోదరిగా నటిస్తుండగా హుమా ఖురేషి కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం 10 ఏప్రిల్ 2025న పెద్ద తెరపైకి రానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com