ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తంగలన్' కేరళ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 08:12 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి తంగలన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క కేరళ థియేటర్ రైట్స్ ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com