ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా ప్రియులకి సదవకాశం

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 06:38 PM

సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి, థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఎప్పుడూ ప్ర‌త్యేక ఆఫ‌ర్లు, రాయితీలను మేకర్స్ ప్ర‌క‌టిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే సినిమా ల‌వ‌ర్స్ డే అంటూ దేశంలోనే అతిపెద్ద మ‌ల్లీప్టెక్స్ దిగ్గ‌జం అయిన‌ PVR, Inox ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా త‌మ మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో ఓ ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆఫ‌ర్ కింద 23.02.2024 శుక్ర‌వారం రోజున‌ PVR, Inox మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో ఏ సినిమానైనా రూ. 99కే చూసే అవ‌కాశం క‌ల్పించింది. అయితే తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, త‌మిళ‌నాడు,కేర‌ళ‌ రాష్ట్రాల‌లో సినిమా ధ‌ర‌ మాత్రం రూ.112గా ప్ర‌క‌టించింది.రెగ్యుల‌ర్‌గా అయితే తెలంగాణ‌ మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో టికెట్ ధ‌ర క్లాసిక్ రూ. 200, రిక్లైన్ రూ.300 ఉంటుండ‌గా ఈ ఆఫ‌ర్ కింద టికెట్ ధ‌రల‌ను క్లాసిక్‌కు రూ.112, రిక్లైనర్‌కు రూ.250 గా నిర్ణ‌యించారు. దీంతో ఈ అవ‌కాశాన్ని దేశ‌వ్యాప్తంగా సినీ ప్రియులు మంచిగా ఉప‌యోగించుకుంటుండ‌గా మ‌రో రెండు రోజులు ఈ ఆఫ‌ర్ కంటిన్యూ చేస్తే బావుంటుంద‌ని, వీకెండ్ క‌లిసి వ‌చ్చేదంటూ చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే స‌ద‌రు PVR, Inox మ‌ల్టీప్లెక్సుల యాజ‌మాన్యం కేవ‌లం ఈ ఒక్క‌రోజు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ ఉంటుంద‌ని, ఈరోజు విడుద‌లైన సినిమాల‌ను కూడా ఈ ఆఫ‌ర్ రేట్ల‌తో వీక్షించ వ‌చ్చ‌ని స్పష్టం చేసింది.ఇదిలా ఉండ‌గా గ‌త సంక్రాంతికి థియేట‌ర్ల‌లో విడుద‌లై దేశ‌వ్యాప్తంగా మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం ‘హ‌నుమాన్’  మాత్రం ఇప్పుడొక బంపర్ ఆఫర్‌తో వచ్చేశాడు. జ‌న‌వ‌రి 12 న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.450 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. చిత్రం రిలీజై 40 రోజులు దాటినా ఇంకా థియేట‌ర్ల‌లో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఈ క్ర‌మంలో హ‌నుమాన్ చిత్ర యూనిట్, మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యంతో క‌లిసి ప్రేక్ష‌కులకు ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ మ‌ల్టీప్లెక్సులలో ఈ హ‌నుమాన్  సినిమాను రూ.112 కే చూడొచ్చ‌ని, ఈ ఆఫ‌ర్ ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ఫిబ్ర‌వ‌రి 29 వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com