ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
సుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీభువీ కలానిజం స్పృషించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోవు గాధ నేనని
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా
![]() |
![]() |