ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 రోజుల్లో 542 కోట్లు రాబట్టిన 'పఠాన్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 06:18 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 5 రోజులకు 271 కోట్లు గ్రాస్ వసూళ్లు చేయగా, అంతేకాకుండా డబ్బింగ్ వెర్షన్‌ల నుండి ఆదివారం 2.25 కోట్ల నెట్‌ని సాధించింది. 5వ రోజు ముగిసే సమయానికి ఈ బిగ్గీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 542 కోట్లు వసూలు చేయడం విశేషం.


ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రానా మరియు ఇతరులు ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి విశాల్ మరియు షేకర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com