ట్యాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న చిత్రం "భోళా శంకర్". తమిళ సూపర్ హిట్ 'వేదాళం' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. రెండు వారాల నుండి భోళా శంకర్ న్యూ షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. పోతే, ఇప్పటివరకు ఈ మూవీ 30శాతం షూటింగ్ జరుపుకుందని, అన్నీ అనుకున్నట్టు జరిగితే మే నెలలో విడుదల అవుతుందని, ఒకవేళ మిస్ ఐతే దసరాకి వస్తుందని రీసెంట్‌గానే మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, భోళా శంకర్ మూవీ మే 12న విడుదల కాబోతుందని మరో ప్రచారం జోరందుకుంటుంది. మరి, మేకర్స్ నుండి రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ వస్తే కానీ, క్లారిటీ వచ్చేలా లేదు.