ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్లో మరొక సంచలనానికి తెరతీసిన RRR ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 12:50 PM

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన "RRR" ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటుంది. ముఖ్యంగా వెస్ట్రన్ దేశాల్లో RRR హవా రోజుకో సంచనలం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న RRR రీసెంట్గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని, ఆస్కార్ అవార్డుల్లో హాట్ ఫేవరెట్ గా నిలిచింది.


అటు అమెరికాలో ప్రఖ్యాత అవార్డులతో RRR హవా చాటుతుంటే, ఇటు జపాన్లో భారీ కలెక్షన్లతో RRR బాక్సాఫీస్ పై యుద్ధం చేస్తుంది.   గతేడాది అక్టోబర్ లో జపాన్లో విడుదలైన RRR ఈనెల 20వ తేదీన డాల్బీ ఫార్మాట్ లో రీ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ RRR సినిమాకు జపాన్లో భారీ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. జనవరి 20న 12.72, 21న 25.92, 22న 28. 79 మిలియన్ యెన్లను RRR కలెక్ట్ చేసిందని మొత్తంగా జపాన్లో 417 కే ఫుట్ ఫాల్స్ తో 649.8మిలియన్ యెన్లను(40. 68 కోట్లు ) RRR కలెక్ట్ చేసి, చరిత్ర సృష్టించిందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com