అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా మెగా ప్రాజెక్ట్ “ఏజెంట్”. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది త్రైమాసికంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తుండగా, ఎకె ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.