జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "బనారస్". జయతీర్థ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు.
కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో హీరో ఒక ఆస్ట్రోనాట్ మరియు టైం ట్రావెలర్. నిజ జీవితంలో టైం ట్రావెల్ చేసే వ్యక్తి. అసలు నిజంగా సాధ్యం అవుతుందా? ఐతే ఎలా? ఈ కధలో హీరో ఎదుర్కొనే సమస్యేంటి? హీరోయిన్ పాత్ర ఏంటి? ... అనే విషయాలతో ట్రైలర్ సినిమాపై మంచి వైబ్స్ తీసుకొచ్చేలా కనిపిస్తుంది.
అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో నవంబర్ నాల్గవ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.