కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన AK 61 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రీసెంట్‌గానే విడుదలయ్యాయి.
ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. రీసెంట్గా విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కు అందుకే అంత క్రేజ్ వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ 2023 సంక్రాంతికి విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
అజిత్ కెరీర్ లో 61వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'తునివు' అనే టైటిల్ ను ఖరారు చెయ్యగా, ఫస్ట్ లుక్ లో అజిత మాస్ స్టైలిష్ స్వాగ్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. 'నో గట్స్, నో గ్లోరీ' అనేది ట్యాగ్ లైన్.
హెచ్ వినోద్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. బే వ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.