ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్ మూలవిరాట్... పోస్టర్ తో పూనకాలు తెప్పిస్తున్న మెగా 154

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 11:42 AM

వెంకీ మామ తరువాత, దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ లాక్ చెయ్యని ఈ మూవీ చిరుకు 154వ సినిమా కావడంతో మెగా #154 గా పిలుస్తున్నారు. ఈ మూవీ పై మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ఎందుకంటే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య డిజాస్టర్ కావడం, చిరు చేతిలో ఉన్న మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అవ్వడంతో బాబీ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు అభిమానులు. భారీ అంచనాలను అందుకోవడంలో బాబీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో చిరు లుక్ రివీల్ అవ్వలేదు కానీ, వర్షంలో తడుస్తున్న చిరు చేతిలోని విభిన్న ఆకారంలో ఉన్న ఆయుధం కనిపిస్తుంది. సంక్రాంతికి కలుద్దాం అని పోస్టర్ మీద ఉండడంతో ఈ మూవీ సంక్రాంతి బరిలోకి దిగబోతుందని తెలుస్తుంది. మెగా 154 అఫీషియల్ టైటిల్, టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.    
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com