ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మహర్షి" మూవీ నుంచి 'పదర పదర పదరా' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 09:42 AM

"మహర్షి" మూవీ నుంచి 'పదర పదర పదరా' పాట లిరిక్స్: 
భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవానా
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా
ఓ ఓ, నీ కథ ఇదిరా.. నీ మొదలిదిరా
ఈ పథమున మొదటడుగెయ్ రా
నీ తరమిదిరా… అనితరమిదిరా అని చాటెయ్ రా
పదర పదర పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా!
ఈ పుడమిని అడిగిచూడు పదరా!
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా!
ఓ, భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే, ఏ
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే



కదిలే ఈ కాలం… తన రగిలే వేదనకి
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా!
పగిలే ఇల హృదయం… తన ఎదలో రోదనకి
వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని
తననడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా

పదర పదర పదరా!
ఈ హలమును భుజముకెత్తి పదరా!
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా!
పదర పదర పదరా!
ఈ వెలుగను పలుగు దించి పదరా!
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు
భూములిక మెతుకులిచ్చు కదరా!



ఏ ఏఏ, నీలో ఈ చలనం… మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం!
నీలో ఈ జడికి… చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం!

నీ ఆశయమే తమ ఆశ అని
తమకోసమని తెలిసాక
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా

పదర పదర పదరా!
నీ గతముకు కొత్త జననమిదిరా!
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి
పదరా!పదర పదర పదరా!
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా!
నీ ఒరవడి భవిత కలల ఒడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా!

తనని తాను తెలుసుకున్న
హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు
మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో, ఓ
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com