ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజినీ - నెల్సన్ ల సినిమాకు అద్దిరిపోయే టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 01:33 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బీస్ట్ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలిసి ఒక ప్రాజెక్టులో భాగమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అధికారికంగా ఇటీవలే ప్రకటించారు కూడా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఆగస్టులో మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ చిత్రంలో శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రజినీకి ఈ సినిమా 169వది . ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయకపోవడంతో తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, రజిని 169 సినిమాకు "బాస్" అనే క్లాస్సీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రజినీకున్న స్టార్డం కు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఐతే, ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంత ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com