ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA బాక్సాఫీస్ వద్ద $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన 'మేజర్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 01:53 PM

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో  అడివి శేష్ నటించిన "మేజర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, మేజర్ సినిమా విడుదలైన మొదటి వారంలోనే $1 మిలియన్‌ని దాటింది. ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com