ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో నితిన్ చేతిలో కమల్ హాసన్ 'విక్రమ్' తెలుగు హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 12:29 PM

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. వెర్సటైల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసారు. ఈ సినిమాలో హీరో సూర్య అతిధి పాత్రలో నటిస్తున్నారని ఇటీవలే దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఎనౌన్స్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. విక్రమ్ హిట్లిస్ట్ పేరుతో హిందీలో కూడా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు ఉత్తరాది ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే విక్రమ్ తెలుగు ట్రైలర్ కూడా రాబోతుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసే హక్కులను ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్ కొనుక్కున్నారు. నితిన్ సొంత బ్యానర్ ఐన శ్రేష్ట్ మూవీస్ విక్రమ్ తెలుగు రైట్స్ ను వశం చేసుకుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీ హక్కులను చేజిక్కించుకునేందుకు నితిన్ భారీ మొత్తాన్నే వెచ్చించాడని వినికిడి. అయితే, ఎంత అన్నది ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే, దేశవ్యాప్తంగా విక్రమ్ మూవీ ప్రమోషన్స్ ను చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com