ఇటీవల విడుదలైన అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో రితికా నారాయణ్ అనే ఢిల్లీ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన ఆ చిత్రం మే 6న విడుదలై సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. విద్యాసాగర్ చింతా డైరెక్షన్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రితికా రుక్సార్ కు చెల్లెలిగా నటించింది. రితికా కు ఇది తొలి సినిమానే అయినా చాలా పరిణతితో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రుక్సార్ కన్నా రితికా కే ఈ సినిమాతో మంచి పేరు, క్రేజ్ వచ్చాయి. ఎంతలా అంటే, ఈ ఒక్క సినిమాతో, అదికూడా హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్లో కనిపించిన రితికా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థైన గీతా ఆర్ట్స్ లో మూడు సినిమాల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నిజానికి ఒక కొత్త హీరోయిన్ కి గీత ఆర్ట్స్ లాంటి పేరున్న నిర్మాణ సంస్థలో అవకాశం రావటమే చాలా కష్టమనుకుంటే రితికా ఏకంగా మూడు సినిమాలలో ఆఫర్ కొట్టేసి లక్కీ చార్మ్ గా పేరు తెచ్చుకుంది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే రితికా AVAK తో వచ్చిన ఫేమ్ తో మరింత చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటుంది. రితికా కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోడరన్ డ్రెస్సులలో ఉన్న రితికా ఫోటోలకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.