ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గీతా ఆర్ట్స్ లో బంపరాఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ... ?

cinema |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 11:11 AM
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన కొత్త చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. విద్యాసాగర్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ కధానాయిక. ఈ సినిమా విడుదలకు ముందు విశ్వక్ చేసిన ప్రాంక్ వీడియో ప్రొమోషన్, ప్రముఖ టీవీ యాంకర్ తో లొల్లి, ఆపై మీడియా వేదికగా చేసిన రచ్చ ... ఇలా AVAK పట్ల ప్రేక్షకుల్లో తగినంత బజ్ క్రియేట్ అయ్యింది. టాలీవుడ్ లో, మీడియాలో విశ్వక్  స్పాట్ లైట్ లో ఉన్నాడు. అయితే, విడుదల తర్వాత స్పాట్ లైట్ మొత్తం మరొకరి మీదకు షిఫ్ట్ అయ్యింది. ఆమెనే వసుధ అలియాస్ రితికా నాయక్. ఈ మూవీలో హీరోయిన్ రుక్సార్ కు చెల్లెలు వసుధ పాత్రలో రితికా నటించింది. ఈ సినిమానే రితికా కు తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా కొత్తనటి అనిపించుకోలేదు. చాలా అనుభవజ్ఞురాలిగా నటించి, ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది. సినిమా ప్రారంభంలో రితికా పాత్ర నామమాత్రంగానే ఉన్నప్పటికీ క్రమంగా మిగిలిన అందరి నటీనటులను పక్కకు నెడుతూ, షో స్టీలర్ గా నిలిచింది. ఆఖరికి హీరోయిన్ రుక్సార్ ను కూడా తలదన్నేలా ఈ బ్యూటీ యాక్టింగ్, లుక్స్ ఉండటం తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రితికాతో మూడు సినిమాల ఒప్పందం చేసుకుందని చిత్రసీమలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో రితికా చేసే మొదటి సినిమాకు తక్కువ పారితోషికమే ఉన్నా, మార్కెట్ ను బట్టి మిగిలిన రెండు సినిమాల రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండనుందట. అయితే, ఈ  విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com