ఇద్దరు యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. అతగాడి ప్రియురాలు పేరు కాజల్. ఏం జరిగిందో ఏమో కానీ ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. దీంతో అతగాడు నేరుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అందరి ముందు వేదిక వద్ద చేరుకున్నాడు. అప్పుడు చుట్టాలు, స్నేహితులతో పెళ్లి వేడుక వైభవంగా ప్రారంభమైంది. ఆ సమయంలో మాజీ ప్రియుడు.. ‘కాజల్ అని అరుస్తూ వేదిక వద్దకు చేరుకున్నాడు.. ’నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సమాజం గురించి పట్టించుకోకు. నిజం చెప్పు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు నిజం చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావా? లేదా అని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాజల్ కూడా అతనికి కౌంటర్ గా నువ్వేవరో కూడా నాకు తెలియదు. ఇక ప్రేమ అనేది చాలా దూరం మాట. అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు. అంతటితో ఆగకుండా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.