ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాలతో సభలో ఆటంకం కలిగింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తీరు మార్చుకోవాలని మందలించారు సభాపతి. అయినా వినకపోవడంతో, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, రామరాజు, రామకృష్ణ బాబును సస్పెండ్ చేశారు స్పీకర్. మొత్తం నలుగురు సభ్యులను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.