గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని షరాఫ్ బజారులో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మంగళగిరి పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు పాపన శివనాగ అన్నపూర్ణ (29) ఓంకార్ అనే వ్యక్తి తో వివాహమైంది. అయితే భర్త ఓంకార్ వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. భార్యను వదిలేసి మరో మహిళతో భర్త ఓంకార్ కు వివాహేతర సంబంధం ఉండటంతో తరచూ వివాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. మృతురాలి తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.