చైనాలో బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. విమానంలో 133 మంది ప్రయాణికులున్నారు. గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో విమానం కుప్పకూలింది. విమానం పూర్తిగా దగ్దమైందని సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. 100 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.