అమెరికా సహా పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ , ఇతర అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించినట్లు. రష్యా మీడియా సంస్థ స్పుత్నిక్ పేర్కొంది. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నందుకు.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, విదేశాంగ, రక్షణ మంత్రులు, ఎంపీలు సహా 3 వందల మంది కెనడావాసులు తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది..