నెల్లూరు జిల్లాలోని 42 మండలాల్లో ఖాళీగా ఉన్న 135 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ గణేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 85 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈనెల 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఈనెల 12న ఇంటర్వ్యూలు నిర్వహించి 14న విదులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.