చిత్తూరు: వాయులింగేశ్వరుడి దర్శనార్థం మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో బియ్యపు ఆకర్షరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.