ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెర్సిడెస్ బెంజ్ కారు భీభత్సం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 10:51 AM

 ఐటీ హబ్ లో విలాసవంతమైన ఖరీదైన బెంజ్ కార్లకు కొదవలేదు. బెంగళూరు నగరంలో ప్రతిరోజు వందలు, వేల సంఖ్యలో బెంజ్ కార్లు రోడ్ల మీద రయ్ రయ్ అంటూ దూసుకుపోతుంటాయి.బెంగళూర నగరంలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఏరియాలో వేలాది కార్లు తిరుగుతుంటాయి. బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఏరియాల్లో ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డు కూడా ఒక్కటి. ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డులో ప్రతిరోజు వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. పాత మద్రాసు రోడ్డు, పాత ఎయిర్ పోర్టు రోడ్డు, దోమ్మలూరు, కోరమంగళ, సిల్క్ బోర్డు జంక్షన్ కు సంచరించే వాహనాలు ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డు మీదుగా వెళ్లి వస్తుంటాయి.


మెర్సిడెస్ బెంజ్ కారు దెబ్బతో షాక్ . ఎప్పటిలాగే నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో మెర్సిడెస్ బెంజ్ కారు వెళ్లింది. ఆ సమయంలో బైక్ ను ఢీకొనింది. బైక్ లో వెలుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో కారు నడుపుతున్న డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించే సమయంలో పక్కనే ఆల్టో కారును ఢీకొనింది. కారును ఢీకొట్టిన తరువాత బెంజ్ కారు అదుపుతప్పి రెండు ఆటోలతో పాటు మొత్తం 7 వాహనాలను ఢీకొనింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసి పోవడం కలకలం రేపింది. ఇంత రచ్చకు కారణం అయిన మెర్సిడెస్ బెంజ్ కారు ఓ లేడీది అని వెలుగు చూసిందని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com