ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 07, 2021, 03:34 PM

నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శుభవార్త చెప్పింది. 317 పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు, మహిళల నుండి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఖాళీల వివరాలు:


మొత్తం ఖాళీలు: 317


-ఫ్లయింగ్‌–77,


-గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)–129,


-గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌)–111


అర్హత:


-ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి.


-గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి కలిగి ఉండాలి.


విభాగాలు: ఏరోనాటికల్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌).


గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌): కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌.


*వయసు: ఫ్లయింగ్‌ బ్రాంచి: 20 నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.


గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచి: 20నుంచి 26ఏళ్లు మధ్య ఉండాలి.


*ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష తదితరాల ఆధారంగా


*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


*దరఖాస్తులకు చివరి తేది: 30.12.2021


*వెబ్‌సైట్‌: https://afcat.cdac.in






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com