తుఫాను ప్రభావం వల్ల డిసెంబర్ 3 నుంచి 6 వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు. దక్షిణ ఆంధ్రలో వర్షాలు తక్కువే ఈసారి. సాధారణంగా విశాఖపట్నం వైపుగా ఇలాంటి తుఫాన్లు లేకపోతే వాయుగుండాలు డిసెంబర్ లో వెల్లవు. ఇది చాలా అసాధారణంగా ఉండే ప్యాటర్న్. గత 200 సంవత్సరాల్లో మూడు తుఫాన్లు మాత్రమే కాకినాడ-వైజాగ్ వైపుగా వెళ్లింది. వర్షాలు
డిసెంబర్ 3 రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొదలౌతుంది. డిసెంబర్ 4 న వర్షాలు అతిభారీగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మీదుగా ఉంటాయి. విశాఖ , తూర్పు గోదావరి కోస్తా భాగాల్లో భారీ వర్షాలు, లోపల ఉండే కొండ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. డిసెంబర్ 5 న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టనుంది. డిసెంబర్ 6 నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోతాయి.
తుఫాను ఓడిషా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లిపోతుంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో కొన్ని ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. ముఖ్యంగా డిసెంబర్ 4, 5 న కొన్ని వర్షాలు. ఇవి ఎటువంటి వరదనుగానీ, ఎటువంటి నష్టాన్ని మిగల్చవు