ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1679 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 11:34 AM

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ (BECIL) 1679 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 20లోగా అప్లయ్‌ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బీఈసీఐఎల్ ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. స్కిల్ల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్ మెన్ తదితర విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వారు అర్హులు. NCVT, SCVT నుంచి గుర్తింపు పొంది ఉండాలి. ఎలక్ట్రికల్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఏదైనా స్టేట్ బోర్డులో 8వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ విభాగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి. సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు ఇంటర్‌/12వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు డీసీఏ, పీజీడీసీఏ కోర్సుల్లో ఏడాది కోర్సు చేసి ఉండాలి. ఇంగ్లీష్, హింది టైపింగ్ పై అవగాహన, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌ లో చూడొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో https://www.beciljobs.com/ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను అప్ లోడ్ చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 590 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రూ. 295 గా నిర్ణయించారు. ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి రూ.16,000 నుంచి రూ.37,500 వరకు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com