ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిలకడగా కాకాణి ఆరోగ్యం... ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 07, 2020, 12:34 PM

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఈనెల రెండవ తేదీ జరిపిన వైద్య పరీక్షలలో  కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన విషయం మీ అందరికి తెలిసినదే. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరిన తరువాత జరిపిన వైద్య పరీక్షల ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకలేదని నిర్ధారణకు వచ్చి, రెండు రోజుల పాటు వైద్యులు పరిశీలించి,తిరిగి ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకలేదని ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారణ చేసుకొని 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించి, డిశ్చార్జ్ చేయడం జరిగింది. మీరందరూ  ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిపై చూపిన ప్రేమాభిమానాలు, ఆయన కోసం చేసిన ప్రార్ధనలు, పూజల ఫలితంగా, మీ ఆశీర్వాదాల వలన కరోనా నుండి తేరుకొని ఎమ్మెల్యే గారు ఆరోగ్యంగా ఉన్నారు.ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 10 రోజుల పాటు విశ్రాంతి లో ఉన్నా, ఫోన్ లో అందుబాటులో ఉంటారు కాబట్టి అవసరమైన వారు నిస్సంకోచంగా ఎప్పుడైనా, ఏ అవసరమైన ఫోన్ చేసి తమ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేసి, పరిష్కరించుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com