ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 22, 2020, 02:04 PM

వాట్సాప్ లో అనేక కొత్త సదుపాయాలు రావాల్సి ఉంది. చాలా కాలం నుండి అవి అంతర్గతంగా ప్రయోగించబడుతున్నాయి తప్పించి, వినియోగదారులకు చాలా ఆలస్యంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా Whatsappలో మరో యూస్‌ఫుల్ ఫీచర్ దర్శనమిచ్చింది. Whatsapp Beta వెర్షన్ 2.20.201.1లో అంతర్గతంగా దీనికి సంబంధించిన కోడ్ పేర్కొనబడి ఉంది. వాట్సప్ ద్వారా మిత్రులకు photoలు, videoలు పంపించే సమయంలో అవి శాశ్వతంగా అవతలి వ్యక్తి ఫోన్ లో ఉండటం కాకుండా, ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత ఆటోమేటిక్ గా తొలగి పోయే విధంగా Expiring Messages అనే ఈ సరికొత్త సదుపాయం వాస్తవానికి చాలా కాలంగా వినియోగదారులను ఊరిస్తూ ఉంది.
Facebook సంస్థ ఇదే రకమైన సదుపాయాన్ని Facebook Messenger వినియోగదారులకు కూడా సుదీర్ఘకాలంగా అందిస్తోంది. సరిగ్గా ఇదే సదుపాయం రాబోయే రెండు మూడు వారాల లోపల Whatsappలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ఇలా ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యే ఫోటో గానీ, వీడియో గానీ, GIF యానిమేషన్ గానీ అవతలివారికి పంపించినప్పుడు వారు మన ఛాట్ నుండి బయటకు వెళ్లిన వెంటనే ఆటోమేటిక్గా మనం పంపించిన మీడియా కంటెంట్ డిలీట్ అయిపోతుంది. అంటే వారు ఛాట్ లో ఉన్నంత సేపు మాత్రమే అది తాత్కాలికంగా కనిపిస్తుంది.
ఎంత సమయం తర్వాత డిలీట్ అవ్వాలి అన్నది టైమర్ సెట్ చేసుకునే అవకాశం దీంట్లో ఉండదు. అవతలి వాళ్ళు చూసిన తర్వాత అది ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది, అలా డిలీట్ అయిన విషయం కూడా ఛాట్‌లో ప్రత్యేకంగా కనిపించదు. అయితే ఎలా పంపించబడిన మీడియాను అవతలి వ్యక్తి స్క్రీన్షాట్ తీసే అవకాశం లేకపోలేదు. అయితే అలా స్క్రీన్ షాట్ తీసి ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేసే ఏర్పాటు ఏదీ ప్రస్తుతానికి Whatsappలో లేదు. కొత్తగా వస్తున్న ఈ Expiring Messages సదుపాయం అతి త్వరలో వినియోగదారులకు లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com