ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్దులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 06:21 PM

ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్దులకు శుభవార్త. టెక్నికల్ ఎడ్యుకేషన్ పై ఆసక్తి ఉంటే నెలకు రూ.12,400 చొప్పున రూ. 3 లక్షల వరకు స్కాలర్ షిప్ పొందవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చదవాలనుకునే వారు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్-GATE లేదా గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్-GPAT ద్వారా ఏఐసీటీఈ అప్రూవ్డ్ ఇన్‍స్టిట్యూట్స్‌లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైన విద్యార్థులకు రూ.12,400 చొప్పున 24 నెలల్లో మొత్తం రూ.2,97,600 స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏఐసీటీఈ అధికారిక వెబ్‌సైట్ aicte-india.org/ లో ఉంటాయి. అడ్మిషన్ సమయంలో గేట్, జీప్యాట్ స్కోర్ ఉండాలి. ఏఐసీటీసీ అప్రూవ్ చేసిన ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీలో చేరాలి. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే 011-29581000, 011-29581333 ఫోన్ నెంబర్లతో పాటు pgscholarship@aicte-india.org ఇమెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com