నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం www.cscgraminnaukri.in గ్రామీణ నౌకరీ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. నిరుద్యోగ యువత పట్టణాలు, గ్రామాల్లో అందుబాటులో ఉండే కామన్ సర్వీస్ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ వైబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న వారికి వెల్డర్, పైబర్ టెక్నీషియన్, పెయింటర్, సెక్యూరిటీ గార్డు తదితర పనుల్లో నైపుణ్యం ఉంటే ఉపాధి కల్పిస్తారు. ప్రైవేటు కంపెనీల నిర్వాహకులు నేరుగా దరఖాస్తుదారులను సంప్రందించి వారి వృత్తి నైపుణ్యాలు పరిశీలించి ఉద్యోగాలు కల్పిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ పేరుతో యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి దిగుమతి చేసుకోవాలి. యాప్‌లో విద్యార్హతకు సంబంధించిన పూర్తి వివరాలు, ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీల నిర్వాహకులు యాప్‌లోని నమోదైన అంశాలను పరిశీలించి వృత్తినైపుణ్యాలు మెరుగ్గా ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైతే చరవాణులకు సందేశం రూపంలో సమాచారం వస్తుంది.