ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి? అని ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ను వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఐఏఎస్ చదువుకుని ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..? అంటూ ఆయన నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి గారిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని పేర్ని నాని మండిపడ్డారు.