ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ లక్షణాలుంటే ప్రెగ్నెన్సీ కన్ ఫామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 06:50 PM

గర్భం దాల్చడం ప్రతి స్త్రీ జీవితంలో అపురూపమైన సందర్భం. దానికోసం ఎన్నో కలలు కంటారు. ఎన్నో ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈ బిజి లైఫ్‌లో ప్రెగ్నెన్సీ లక్షణాలను గుర్తించడంలో చాలామంది మహిళలు ఫెయిల్ అవుతున్నారు. అలా గుర్తించలేకపోవడం వల్ల ఒక్కోక్కసారి వచ్చిన ప్రెగ్నెన్సీ పోయే ఛాన్స్‌లు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కన్ ఫామ్ అయినప్పుడు శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. వాటిని గుర్తిస్తే జాగ్రత్త పడొచ్చు.ప్రెగ్నెన్సీ లక్షణాలను గుర్తించాలంటే ముందుగా శరీరంలో అండం విడుదల, దాని పనితీరు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి మహిళ శరీరంలో అండం అండాశయం నుంచి విడుదల అవుతుంది. 28 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తూ ఉంటే పీరియడ్ స్టార్ట్ అయిన 14 రోజుల తర్వాత అండం విడుదల అవుతుంది. అయితే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అందరికీ ఒకేలా ఉండదు. వ్యక్తిని బట్టి మారుతుంది. ఆ అండంలోకి వీర్య కణం ప్రవేశించడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయ్యేటప్పుడు మహిళల్లో కొన్ని రకాల లక్షణాలు కనబడతాయి.అండం విడుదల అయ్యే సమయం‌లో వైట్ డిశ్చార్జ్ క్లియర్‌గా, పల్చగా, ఎగ్ వైట్‌ని పోలి ఉంటుంది. ఈ తేడాని కనుక్కోడం చాలా తేలిక. ఈ ఫ్లూయిడ్‌ని వేళ్ల మధ్య ఒక ఇంచ్ వరకూ స్ట్రెచ్ చేయవచ్చు. అయితే చేతులను చాలా శుభ్రం చేసుకుని చెక్ చేయాలని గుర్తు పెట్టుకోండి. కొంతమందికి అండం విడుదలయ్యే సమయంలో కొద్దిగా కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. కొంతమందికి నాదుగా, మరికొంతమందికి కడుపులో పోటుగా అనిపించవచ్చు.అలాగే ఈ సమయంలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక కూడా పెరుగుతుంది. ఏ జ్వరం లేకుండా బాడీ కొంచెం వెచ్చగా ఉంటే అండం విడుదల అయినట్టు లెక్క. పొద్దున్న లేవగానే టెంపరేచర్ చెక్ చేసుకున్నారంటే, అండం విడుదల అయినప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మీ రెగ్యులర్ బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది.కొంత మందికి మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో కొంచెం స్పాటింగ్ కనపడినా కూడా అండం విడుదల అయినట్టుగా అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రతి మహిళకు ఇలా జరుగుతుందని చెప్పలేం. అండం విడుదలయ్యే సమయంలో కొంతమందికి వాసన బాగా తెలుస్తుంది. కొంత మందికి మాత్రం టేస్ట్, విజన్ బాగా పని చేస్తాయి.మామూలు సమయాల్లో సర్విక్స్ గట్టిగా, మూసుకున్నట్టుగా ఉంటుంది. టచ్ చేస్తే ముక్కు కొనంత గట్టిగా ఉంటుంది. కానీ అండం విడుదల అయినప్పుడు మాత్రం సాఫ్ట్‌గా తెరుచుకున్నట్టుగా అవుతుంది. టచ్ చేస్తే చెవి తమ్మెనో, పెదవులనో టచ్ చేసినంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఓవులేషన్ టైంలో ప్రెగ్నెన్సీ‌కి అనువుగా బ్రెస్ట్ టిష్యూ మారుతుంది. దాంతో బ్రెస్ట్స్ సెన్సిటివ్‌గా తయారవుతాయి. తాకితే కొంచెం నొప్పిగా కూడా అనిపించవచ్చు.ప్రెగ్నెన్సీ సమయంలో టెక్నాలజీ ఎంత పెరిగినా శరీరంలో జరిగే మార్పులే మంచి సంకేతాలవుతాయి. వాటిని సకాలంలో గుర్తిస్తే ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. అయితే చాలామందికి ఈ విషయాలు తెలియవు. ప్రతి మహిళకు ఈ విషయం తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com