ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిని ప్రజారాజధానిగా చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:51 AM

వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి : అమరావతి బృహత్‌ ప్రణాళిక రూపక ల్పన, స్టార్టప్‌ ప్రాంతం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగపూర్‌ ప్రభు త్వంతో ఏపీ అనుబంధాన్ని మరింత బలోపేతందిశగా సోమవారం కీలక ఒప్పం దం కుదిరింది. ఈ ఎంవోయూలో భాగంగా 1691 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. స్టార్టప్‌ ప్రాంతాభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ తదితరులు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మందడంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్ని కల ముందు ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో నేనో మాట చెప్పా. రాజధాని లేదు. కాలేజీలు, పరిశ్రమలు లేవని, ధృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం మాత్రం ఉంది. మళ్లీ సింగపూర్‌లాంటి సిటీ నిర్మిస్తానన్నానని, ఆ మాట నేడు సఫలీకృత మవుతుండడం ఎంతో ఆనందంగా ఉందనఇన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమ రావతి నిర్మాణం చేస్తామంటే ఎంతోమంది ఎగతాళి చేశారని, సాధ్యమయ్యే పనేనా అన్నారని చెప్పారు. 29 గ్రామాలు భూములు ఇచ్చినా, కృష్ణానది తీరం ఉన్నా, కనకదుర్గ ఆశీస్సులు ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణం సాధ్యమయ్యే పనేనా అని అనుమానం వ్యక్తంచేశారని, కానీతాను అసాధ్యమేమీ కాదన్నానని, అదే సమయంలో ప్రజలు చొరవ చూపారని చెప్పారు. ప్రభుత్వానికి అండగా నిలిచారని, భూమి కొనాలంటే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు తనపై ఉన్న విశ్వాసంతో వెనకాముందు ఆలోచించకుండా 33వేల ఎకరాల భూమిని ఇవ్వ డంతోపాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు అపూర్వంగా స్పందిం చారన్నారు. రాజధాని అభివృద్ధి పనులకు అడుగడుగునా ఇబ్బందులు, సమ స్యలు సృష్టించారని, ప్రజలు చొరవ చూపడం వల్ల ఎవరూ ఏమీ చేయలేకపో యారని అన్నారు. ఈ పని సంవత్సరం కంటే ముందే జరగాల్సిందని,  కానీ న్యాయస్థానాలను ఆశ్రయించడం, పదేపదే ఆరోపణలు చేయడంతో ఆలస్య మైందని, సంకల్పబలం ఉంటే మనలో మంచితనం ఉంటే.. ప్రపంచంలో ఎవ రైనా మనతరపున నిలుస్తారని చంద్రబాబు స్పష్టంచేశారు. గతంలో మలేషియా నుంచి వేరైనప్పుడు సింగపూర్‌లోనూ ఇదే మాదిరిగా ఇబ్బందులు వచ్చాయని, సుందర నగరంగా, ప్రపంచం మెచ్చే నగరంగా తీర్చిదిద్దారన్నారు. దూరదృష్టి తో ముందుకెళ్లారని, ఆ మహానాయకుడు చేసిన చొరవ ప్రపంచానికే ఆదర్శ మైందని వెల్లడించారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను నాలెడ్‌‌జ హబ్‌గా మార్చేం దుకు ఎంతో కృషిచేశామని,  సింగపూర్‌ ప్రభుత్వం ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి ఇచ్చిందని కొనియా డారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధాని నగరానికి శంకుస్థాపన చేశారని, ఆ రోజు ఈశ్వరన్‌, జపాన్‌ మంత్రి వచ్చారని, మన దేశంలో ఉన్న ప్రధాన దేవా లయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వార్‌ ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టి ని, నీటిని తీసుకొచ్చి ఈప్రాంతాన్ని పునీతంచేశామన్నారు. అప్పుడే  దుష్టశక్తుల కుట్రలు, పన్నాగాలు ఫలించవని తనకు అర్ధమైందన్నారు. మంచి మనుసు ఉంటే ఏదైనా కలిసి వస్తుందని, అమరావతి అని పేరు పెట్టినప్పుడు నూటికి నూరుమంది ఆమోదం తెలిపారని, రోజు అమరావతి పేరు ప్రపంచంలో ఎక్కడ చెప్పినా బ్రహ్మాండమైన స్పందన వస్తోందన్నారు. స్వర్గంలో దేవతలంతా ఉంటా రని, వారి రాజధాని అమరావతి అని,  ఆ అమరావతికి రాజు దేవేంద్రుడు అని, అలాంటి బ్రహ్మాండమైన రాజధానిని భూతల స్వర్గాన్ని మనం నిర్మాణం చేసుకో బోతున్నందుకు ప్రతిఒక్కరూ గర్వించాలన్నారు. తెలుగు వారి చరిత్ర భావితరా లకు ఆదర్శంగా శాశ్వతంగా ఉండాలని ఆలోచించానని,  బ్రహ్మాండమైన ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానంలే దని చంద్రబాబు స్పష్టం చేశారు. నగరంగా ఉండేలా అమరావతిని తీర్చి దిద్దుతామని,  తెలుగువారికి ఇదో స్వప్నమని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని, ప్రతి సోమవారం ఆ ప్రాజెక్టుపై సమీక్షిస్తున్నామన్నారు.  ఏపీకి అదో వరమని, దాన్ని పూర్తిచేస్తే కరవు అనేమాటే వినబడదన్నారు. ఇదో ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నామని,  ఎట్టి పరిస్థితుల్లో 2018కి పోలవరం ద్వారా గ్రావిటీతో నీరు రావాలన్నారు. 2019 నాటికి పూర్తికావాలని, అన్ని జిల్లాల్లో కాల్వల నిర్మాణాలు పూర్తికావాలన్నారు. ఎక్కడి జలాలను అక్కడే భూగర్భజలాలుగా మార్చి నీటి కొరతలేకుండా చేయా లని పిలుపునిచ్చారు. స్టార్టప్‌ ఏరియాకు 1.25లక్షల కుటుంబాలు వస్తాయని, దీంతో సుమారు రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అమరా వతిని ప్రజా రాజధానిగా నిర్మాణం చేస్తామని, బహుళ అంతర్జాతీయ సంస్థల కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com