ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజర్వేషన్‌ల హేతుబద్ధీకరణ జరగాల్సిందే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2017, 02:19 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : ఎస్సీ రిజర్వేషన్‌లు హేతుబద్దీకరణ జరగాల్సిందే నని, రిజర్వేషన్‌ ఫలాలు అన్ని వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం సమన్యాయం జరిగినపుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డా బాబా సాహెబ్‌ అంబే ద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ అన్నారు. నగరంలో గురువారం జరి గిన ‘ఎపి ఎంఆర్‌పీఎస్‌ రాష్ర్ట ప్రతినిధుల సదస్సు’కు ఎపి ఎంఆర్‌పిఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎస్‌. రాజు మాదిగ సభాధ్యక్షత వహించగా ప్రకాష్‌ అంబేద్కర్‌, సిపిఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ, ఎపి ఎంఆర్‌పిఎస్‌ రాష్ర్ట అధ్యక్షులు జన్ని రమణయ్య మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన కులాల నుండి తీసుకునే రిజర్వేషన్‌లలో న్యాయం వున్నదంటే, ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ కూడా న్యాయ మైన దేనని, ఎస్సీలోని ఉపకులాలన్నీ ఐకమత్యంగా పోరాడి వర్గీకరణ సాధించు కోవాలని పిలుపునిచ్చారు. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీక రణ ఉద్యమంలో సిపిఐ పార్టీ ముందు నుండే మద్దతు వుందని, భవిష్యత్‌లో జరిగే పోరాటాలలో కూడా సిపిఐ ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటుందని అన్నారు. ఎపి ఎంఆర్‌పిఎస్‌ రాష్ర్ట అధ్యక్షులు జన్ని రమణయ్య మాదిగ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎస్‌.రాజు మాదిగలు మాట్లాడుతూ జూన్‌ 15వ తేదీన లక్షమంది మాదిగలతో ‘మాదిగల మహాసంకల్ప సభ’ను అమరావతిలో నిర్వహి స్తామని, రాష్ర్ట ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి మాదిగలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.  


    రాష్ర్ట ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో తెలంగాణాలో వర్గీకరణ అనుకూలమని, ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకంగా వ్యవహ రించడం ఆయన రెండు నాల్కల సిద్దాంతానికి నిదర్శన మన్నారు. వర్గీకరణ పట్ల ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాం డ్‌ చేశారు. జూన్‌ 15న జరిగే మాదిగల మహాసంకల్ప సభకు లక్షలాదిగా మాదిగ, ఉపకులాల ప్రజలు తరలివచ్చి వర్గీకరణ పట్ల జాతి ఆకాంక్షను ప్రభు త్వానికి తెలియపరిచే విధంగా యుద్దానికి సిద్దపడాలని పిలుపునిచ్చారు. 


    ఈ కార్యక్రమానికి రాష్ర్ట మహిళా ధ్యక్షురాలు శ్రీరాం దేవమణి, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కోనసీమ ఇశ్రాయేలు, ఏలూరు హరికృష్ణ, రాష్ర్ట కార్యదర్శి తెనాలి కోటయ్య, రాష్ర్ట ఉపాధ్యక్షులు కడప గంగయ్య, రాష్ర్ట యువసేన అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు మేకల దాసు, తూర్పు గోదా వరి జిల్లా అధ్యక్షుడు బుంగా సంజయ్‌, రాష్ర్ట, జిల్లా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com