రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 6 బంతులు ఆడిన డి కాక్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో డికాక్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. జుబేర్ హంజా (0), డు ప్లెస్సిస్ (0) క్రీజులో ఉన్నారు.