ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు రాహుల్‌ ద్రవిడ్‌ అంటే ఇష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2017, 03:20 PM

దిల్లీ: బాలీవుడ్‌ తారలకు క్రికెట్‌ అన్నా, క్రికెటర్లు అన్నా ఎంతో ఇష్టం. సన్నీ లియోనికి ‘మిస్టర్‌ కూల్‌’ మహేంద్రసింగ్‌ ధోనీ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. మరి కుర్రకారు మది దోచిన సొగసరి కత్రినా కైఫ్‌కు ‘ది వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ అంటే అభిమానమట. ద్రవిడ్‌తో మూడు మాటల కన్నా ఎక్కువ మాట్లాడలేకపోయానని అంటోంది.‘నాకు రాహుల్‌ ద్రవిడ్‌ అంటే ఇష్టం. అతను నిజమైన మర్యాదస్తుడు. ఆందోళనలో ఉన్నట్టు అస్సలు కనిపించడు. ఆవేశ పడడు. అత్యుత్సాహం ప్రదర్శించడు. ఆయనతో మూడు మాటల కన్నా ఎక్కువ మాట్లాడలేదు. ఆయన కాస్త సిగ్గరి’ అని చెప్పింది క్యాట్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ద్రవిడ్‌ సారథిగా ఉన్నప్పుడు కత్రినా ఫ్రాంచైజీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేది. ప్రస్తుతం ద్రవిడ్‌ దిల్లీ డేర్‌డెవిల్స్‌ మార్గనిర్దేశకుడిగా ఉన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com