ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారణాసిలో ప్రైవేట్​ స్కూల్ కి రూ.618కోట్ల కరెంట్​ బిల్లు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 12:58 PM

వారణాసిలో ఒక ప్రైవేట్​ స్కూల్​ కి ఏకంగా రూ.618కోట్ల కరెంట్​ బిల్లు వచ్చింది. ఇరవై గదులు ఉన్న ఆ పాఠశాలలో పగటిపూట మాత్రమే కరెంటు వాడతారు. సాయంత్రం తర్వాత వాచ్​మెన్​ తప్ప ఎవరూ ఉండరు.  బిల్లు మహాఅయితే వేలల్లో వస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఏకంగా రూ.618కోట్లు కట్టాలంటూ విద్యుత్​ శాఖ నోటీసులిచ్చింది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసిలో వెలుగుచూసిన అధికారుల నిర్లక్ష్యమిది. యూపీ సర్కారు కరెంట్​ చార్జీలు పెంచినరోజే.. వారణాసి వినాయకనగర్​లో ఉన్న స్కూల్​కి కోట్లలో బిల్లు రావడం చర్చనీయాంశమైంది. దీనిపై స్కూల్​ యాజమాన్యం విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసింది. సాఫ్ట్​వేర్​ సమస్యవల్లే బిల్లు కోట్లలో జనరేట్​అయిందన్న అధికారులు.. అంత మొత్తాన్నీ ఈ నెల 7లోగా కట్టితీరాల్సిందేనని, లేకుంటే పవర్​ కట్​చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో స్కూల్​వాళ్లు సోషల్​మీడియాలో తమ గోడువెళ్లబోసుకున్నారు. విషయం వైరల్​ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకిదిగినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com