ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయుడికి పాక్‌ మరణశిక్ష విధించడం మానవహక్కుల సూత్రాలకు విరుద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 12, 2017, 12:44 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : కులభూషన్‌ జాదవ్‌ అనే భారతీయుడిపై బలు చిస్తాన్‌, కరాచీలలో గూడచర్యం, విద్రోహాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మార్షల్‌ కోర్టు రహస్యవిచారణ జరిపి ఉరిశిక్ష విధించడం ఇది పాకిస్థాన్‌ నియంతృత్వ పోకడలకు, భారతదౌత్య వైఫల్యానికి విదర్శనం. ‘రా’ ప్రణాళిక మేరకు పాక్‌లో అస్థిర కార్యకలాపాలు లక్ష్యంగా గూడచర్యం, విద్రోహచర్యలు సమన్వయం నిర్వహణ బాధ్యతలు  నిర్వహించినట్లు బలూచిస్థాన్‌ కరాచీలో శాంతి పునరుద్ధ రణ చర్యలకు ప్రతిబంధనం కల్గించే చర్యలకు పాల్పడినట్లు పేర్కొనడం హాస్యాస్పదం. పొంతనలేని ఆరోపణలు, దురుద్ధేశ్యముతో కూడిన ఆరోపణలు తప్ప, కులభాషణ్‌ జాదవ్‌ పలాన సంఘటనలో పాల్గొన్నాడు అని చెప్పటానికి ప్రత్యేకమైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే ఉరివేయడం ప్రపంచదేశాలు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది. పాకిస్థాన్‌ అస్థిత్వానికి పాక్‌లో వేలాది మంది ఉగ్రవాదులు చాలని, వేరే దేశాలనుండి వెళ్ళవలసిన అవసరం లేదు అని పాకిస్థాన్‌ ఉగ్రవాదులు, జిహాదీలు ఎంతో మంది పాకిస్థాన్‌ ప్రార్ధనా మందిరాలలో బహిరంగ ప్రదేశాలలో బాంబులు పెట్టి ముస్లింలను చంపు తున్నారని అంతకంటే అస్థిరత్వత ఏముంటుంది అని ప్రశ్నించారు. విదేశీ యుడిపై ఎలాంటి ప్రత్యేక ఆరోపణలు లేకుండా ఉరిశిక్ష వేసినపుడు యు.ఎన్‌.ఓ.హ్యూమన్‌ రైట్స్‌ చాప్టర్‌ క్రింద ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి అప్పీలుకు అవకాశం కల్పించవలసిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని, దానికి రాష్ట్రపతి తగిన చొరవ చూపాలని ఎపి కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. లేదంటే పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలయిన రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌ సరిహద్దు ప్రాంతాలలో వ్యవసాయకూలీలు, మత్యకారులు అక్రమంగా అరెస్టు చేసి ఉగ్రవాదులుగా చూపి ఉరిశిక్షలు వేసే ప్రమాదముందని ఆందోళన వెలిబుచ్చినట్లు ఏపిసిసి ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి వి.గురునాధంలు సంయుక్తంగా మంగళవారం ఏపిసిసి రాష్ర్ట కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com