విజయవాడ, సూర్య బ్యూరో : ఎన్టిఆర్ట్రస్ట్ విద్యా విభాగం ద్వారా విద్యార్హత వుండి బోదనానుభవం లేని వారికి సీనియర్ అధ్యాపకులచే హైదరాబాద్, గండిపేట లోని ఎన్టిఆర్ మోడల్ స్కూల్లో రెండు వారాలపాటు ఎంపికైన 50 మందికి (25 స్త్రీలు, 25 పురుషూలు) ఉచిత వసతి, భోజనంతో సహా శిక్షణనిచ్చి వారిని ఎన్‌టి ఆర్ విద్యా సంస్థలతో సహా వివిధ విద్యా సంస్థలలో ఉద్యో గం సంపాదించుకోవడానికి సహాయ సహకారాలు అంది స్తామని నారా బ్రాహ్మణి తెలిపారు. కేవలం బోధనా నుభవం లేని కారణంగా ఉద్యోగం పొందలేని ప్రతిభా వంతులైన అర్హత గల ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ద్వారా మంచి సంస్థలలో ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇంగ్లీషూ మీడియంలో బోధించడానికి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వారి బయోడేటాను ప్రిన్సిపాల్ ఎంఎస్ హైదరాబాద్ ఎట్దిరేట్ఆఫ్ఎన్టిఆర్ ట్రస్ట్.ఓఆర్‌జి మెయి ల్కు ఈనెల 20లోపు పంపించవచ్చు. ఇతర వివరాలకు 8885553475, 9912341941, 9248444919 నెంబర్లలో సంప్రదించవచ్చు.