ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11 అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్మీ అసోసియేట్స్‌, జీఐఐసీ ప్రణాళిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2017, 01:16 AM

(అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి):రాజధాని అమరావతి నగర భవిష్యత్తు అవసరాలకు భరోసా ఇచ్చేలా మౌలిక సదుపాయాల మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. సీఎం చంద్రబాబు విజన ఆధారంగా, ఏడీసీ (అమరావతి అభివ ద్ధి సంస్థ), ఏపీసీఆర్డీయేల నేత త్వంలో మన దేశానికి చెందిన ఆర్వీ అసోసియేట్స్‌, చైనాకు చెందిన జీఐఐసీ సంయుక్తంగా స్మార్ట్‌ ఇంటెగ్రేటెడ్గ ఇనఫ్రాస్ట్రక్చర్‌ మాస్టర్‌ ప్లాన(ఎస్‌ఐఐఎంపీ)ను రూపొందించాయి. ఇందుకోసం పలు దేశాల్లో వీటి ప్రతినిధులు పర్యటించారు. అనంతరం 217.23 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అమరావతి నగరంలో 2050 నాటికి ఉండబోయే జనాభాకు అనుగుణంగా, అత్యున్నత మౌలిక వసతులను పర్యావరణ హితంగా ఏర్పాటు చేసేలా ఈ మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబు ప్రవచిస్తున్న ‘హరిత- నీలి రాజధాని’ (గ్రీన్‌, బ్లూ కాన్సెప్ట్‌) నిర్మాణానికి ఉద్దేశించిన మాస్టర్‌ ప్లాన్‌ తో ప్రస్తుత ఇన్‌ ఫ్రా మాస్టర్‌ ప్లాన్‌ కు చక్కటి సమన్వయం కుదిరేలా చూశారు. రాజధానిని స్మార్ట్‌గా నిలిపేందుకు 24 గంటలూ నాణ్యమైన నీరు, పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, రవాణ, విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా, సమాచార వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. విద్యుత్‌ విషయంలో మొత్తం 3 జోన్లుగా విభజించి 220/33 సామర్థ్యంతో 18 కేవీ సబ్‌స్టేషన్లు, 400/220 కేవీ సామర్థ్యంతో 3 సబ్‌స్టేషన్లను నిర్మించడంతోపాటు ఏడాదికి కనీసం 1816 మెగావాట్ల సౌరవిద్యుత్‌ వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. మురుగు నీరు, విద్యుత్‌, గ్యాస్‌, కేబుళ్ల వ్యవస్థ మొత్తం భూగర్బంలోనే అత్యాధునిక పద్ధతిలో ఏర్పాటు నిర్మిస్తారు. ఘన వ్యర్థాల విషయంలో నగరాన్ని 3 జోన్లుగా విభజించారు. వ్యర్థాలను వాటి స్వభావాన్ని బట్టి వర్గీకరించి, సేకరించి, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు తరలించి, శుభ్రపరచాలని పేర్కొన్నారు. ఇందుకోసం 3 ట్రాన్సఫర్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌లో 11 అంశాలకు కన్సల్టెంట్లు ప్రాధాన్యమిచ్చారు. అవి ట్రాఫిక్‌ అండ్గ ట్రాన్సపోర్టేషన్‌, వాటర్‌ సప్లై అండ్గ ఫైర్‌ ఫైటింగ్‌, వేస్ట్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌, స్టార్మ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, విద్యుత్‌, ఘనవ్యర్థాల నిర్వహణ, వంటగ్యాస్‌ పంపిణీ, ఇన్ఫర్మేషన్‌ అండ్గ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌, సేఫ్టీ అండ్గ సెక్యూరిటీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌. 2050 నాటికి రాజధాని జనాభా 35.50 లక్షలకు చేరుతుందని అంచనా. ఈ జనాభాతోపాటు వాణిజ్య, పారిశ్రామికవాడలకు నీటి సరఫరా వ్యవస్థను ఈ ప్లాన్‌లో ప్రతిపాదించారు. వాగులు ఇతర జలవనరులపై పెద్దగా ఆధారపడకుండా, ప్రకాశం బ్యారేజీపై ఒత్తిడి పడకుండా, దానికి 20 కిలోమీటర్ల ఎగువన వైకుంఠపురం వద్ద 6.53 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తారు. అంతేకాదూ అమరావతివాసులకు పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన జలాలను అందజేసేందుకు క ష్ణానదీతీరంలో 2 భారీస్థాయి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటను ఏర్పాటు చేయాలని నిర?యించారు. వీటిల్లో ఒకదానిని ప్రకాశం బ్యారేజీ వద్ద (367 ఎం.ఎల్‌.డి.ల సామర్ధ్యం)తో, రెండో దానిని అబ్బరాజుపాలెం సమీపంలో (486 ఎం.ఎల్‌.డి.ల కెపాసిటీతో) నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు నదీజలాలను ప్రత్యేక పైపులైన (రా వాటర్‌ ్ట్రంక్‌ మెయిన) ద్వారా చేర్చి, ప్లాంట్లలో శుద్ధి పరచిన అనంతరం రాజధాని నగరవ్యాప్తంగా సుమారు 45 కిలోమీటర్ల పొడవున విస్తరించి, 2 బ్యారేజీలతోనూ అనుసంధానమై ఉండే రింగ్‌మెయిన సిస్టం(ఆర్‌.ఎం.ఎస్‌.) పైపులైన్‌లోకి పంపుతారు. రింగురోడ్డు మాదిరిగా నిర్దేశిత ప్రదేశం యావత్తూ విస్తరించి ఉండే ఈ ఆర్‌.ఎం.ఎస్‌. నుంచి రాజధానిలోని అన్ని ప్రదేశాలకూ శుద్ధి చేసిన నీటిని అందజేసేందుకు వీలుగా 24 ట్యాపింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి అమరావతి నగరంలోని సకల ప్రాంతాలకూ అవసరమైన నీటిని నిరంతరాయంగా సరఫరా చేసేందుకు రాజధానిని మొత్తాన్ని 60 వాటర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు(డబ్ల్యు.డి.సి.)లుగా విభజిస్తారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అవకాశం లేకపోవడంతో ప్రెజరైజ్డ్‌ పంపింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా నీటి వథానూ అరికట్టవచ్చు. రవాణా సాఫీగా, పర్యావరణహితంగా ఉండేలా ఈ ప్రణాళికలో పలు సూచనలు చేశారు. మొత్తం 5 రకాలైన రోడ్లను ప్రణాళికలో సూచించారు. వీటి మొత్తం పొడవు 593 కిలోమీటర్లు ఇందులో మేజర్‌ ఆర్టీరియల్‌ (వెడల్పు 60 మీటర్లు - పొడవు 52 కి.మీ.), సీడ్గ యాక్సెస్‌ (60- 19), ఆర్టీరియల్‌ (50- 94), సబ్‌ ఆర్టీరియల్‌ (50- 151), కలెక్టర్‌ రోడ్లు (25 మీ- 277 కి.మీ.) ఉన్నాయి. సెం్టల్‌ డివైడర్‌పైన, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతారు. ‘జాతీయ అర్బన్‌ ట్రాన్స్‌ పోర్టు పాలసీ’ని అనుసరించి అమరావతిలో ‘గ్రీన్‌ అండ్గ స్మార్ట్‌’ ట్రాన్సో్పర్టు సాధనాలకు ప్రాధాన్యం ఇస్తారు. మోటారైజ్డ్‌, నాన్‌ మోటారైజ్డ్‌ (సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు తదితరాలు) ట్రాఫిక్‌లను వేరు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను పెంచి బస్‌ ర్యాపిడ్గ ట్రాన్స్‌ పోర్టు(బీఆర్టీ), మాస్‌ ర్యాపిడ్గ ట్రాన్స్‌ పోర్టు (ఎంఆర్టీ)లను పెంచాలని, హైస్పీడ్గ రైల్‌ కారిడార్లను ప్రవేశపెట్టాలని, వినోద ప్రయోజనాల కోసం కాలువలను వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు. పార్కింగ్‌ వ్యవస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 


   అభివద్ధి చెందిన దేశాల్లో మ్త్రామే కనిపించే డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ వ్యవస్థను అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ కోసం కన్సల్టెంట్లు ప్రతిపాదించారు. కేంద్రీక తంగా ఉండే శీతలీకరణ ప్లాంట్ల ద్వారా చల్లటి గాలులను ప్రభుత్వ కార్యాలయాలకు పంపడమనే ఈ విధానం ద్వారా వ్యక్తిగత ఏసీ ప్లాంట్ల వినియోగం భారీగా తగ్గి, పర్యావరణానికి మేలు చేకూరుతుంది. ప్రజల ధనమానప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేలా చూడడంతోపాటు రహదారులపై రాత్రివేళల్లో అంధకారం అలుముకోకుండా పూర్తిస్థాయిలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. సేఫ్టీ అలారం వ్యవస్థలను విస్త తంగా వినియోగించాలని, నగరంలోకి ప్రవేశించే, రాకపోకలు సాగించే నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించింది. ఎక్కడికక్కడ 4జీ స్టేషన్లను నెలకొల్పి శక్తిమంతమైన యాంటెన్నాలు ఏర్పాటు చేయాలి. ‘సీఎం డ్యాష్‌బోర్డు’ తరహాలో రాజధానికి సంబంధించిన సకల అంశాలనూ చిటికెలో, సమగ్రంగా తెలుసునేందుకు వీలు కల్పించే వ్యవస్థను అభివద్ధి పరచాలని సూచించారు. భూసమీకరణ పథకంలో రైతులకు ఇచ్చే ప్లాట్లను నివాస, వాణిజ్య, జనరల్‌, మిక్స్‌డ్గ జోన్లు, నైబర్‌హుడ్గ, రీజినల్‌, టౌన్‌ సెంటర్లు, బిజినెస్‌ పార్కు, కాలుష్యరహిత పరిశ్రమలు, రిజర్వ్‌, రోడ్గ రిజర్వ్‌ జోన్లు .. ఇలా పలు ప్రయోజనాలకు నిర్దిష్ట ప్రదేశాలను కేటాయించడం ద్వారా అన్నింట్లోనూ ప్రణాళికాబద్ధ అభివ ద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com