చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుండి చిరుజల్లులు పడుతున్నాయి. గురువారం సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై ఉంది. కాగా గత 24 గంటల్లో చీరాల మండలంలో 15, వేటపాలెం మండలంలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శుక్రవారం సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆ ప్రకటనలో వెల్లడించారు. చల్లబడ్డ వాతావరణం లో ప్రజలు సేద తీరుతున్నారు.