లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో 200 సంకల్ప సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగడతామని పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ అన్నారు. నాలుగు లోక్సభ స్థానాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఆప్ సీనియర్ నేతలు, మంత్రులు పాల్గొంటారు.