ధర్మవరం పట్టణం పోతుకుంట బీసీ కాలనీకి చెందిన అంగజాల మాధురి బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్నది. కాగా మూడు రోజుల క్రితం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో మాధురి 1000కి 987 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నాలుగవ ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు శ్రీనివాసులు అనురాధ తెలిపారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థినికి స్వీట్ తినిపించి అభినందించారు.