టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అమలాపురంలో కొనసాగుతోంది. పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగనుంది. ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు.. ఎంపీటీసీ, సర్పంచ్‌లు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆక్వారైతులతో లోకేష్ సమావేశమయ్యారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. సీడ్, ఫీడ్, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఆక్వా రైతులను ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసిందని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగాన్ని ఆదుకుంటామన్నారు. ఫీడ్, సీడ్, విద్యుత్ ధరలు తగ్గేలా చర్యలు.. గిట్టుబాటు ధరకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు