అమరావతి : బిజెపి చేసిన ద్రోహానికి 40 ఏళ్లుగా తాము వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్తో జత కట్టాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందరూ ఈర్ష్య పడేలా రాజధానిని నిర్మిస్తామిన ఆయన చెప్పారు. అమరావతి ద్వారా ఆదాయం వస్తుందని, దాని ద్వారా అప్పులు తీరుస్తామని ఆయన చెప్పారు. అమరావతిలో ఉన్న అతి పెద్ద ల్యాండ్ బ్యాంకే మనకు ఆస్తి అని ఆయన అన్నారు.