గుంటూరు జిల్లా మంగళగిరిలో గ్రామదర్శిని రాష్ట్రస్థాయి నోడల్ అధికారుల సదస్సు జరిగింది. నోడల్ అధికారుల సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సుకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారా లోకేశ్, పితాని సత్యనారాయణలతో పాటు వెయ్యి మంది గ్రామదర్శిని నోడల్ అధికారులు హాజరయ్యారు. సదస్సులో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతికి నివాళులర్పించారు.